తలపతి విజయ్ పార్టీలోకి నటి త్రిష?

తమిళ హీరో తలపతి  విజయ్ వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీలో పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ధృవీకరించేశారు. తమిళనాట పొత్తులు లేకుండా ఒక కొత్త పార్టీ ఒంటరిగాఎన్నికల బరిలోకి దిగడం సాహసమనే చెప్పాలి. అయితే తన అభిమానుల బలంతో తమిళ రాజకీయాలలో సొంత బాట ఏర్పాటు చేసుకోగలన్న విశ్వాసం, ధీమా విజయ్ లో వ్యక్తం అవుతున్నాయి. 
అయితే తళపతి విజయ్ కు కోలీవుడ్ పరిశ్రమ మద్దతు ఏ మేరకు ఉంటుందన్న సందేమాలు పరిశీలకులలో వ్యక్తం అవుతున్నాయి.

ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్ అధికార పార్టీకి బహిరంగంగా మద్దతు తెలపడమే కాకుండా, పరోక్షంగా విజయ్ పై రాజకీయ విమర్శలు కూడా చేశారు. ఇక మరో హీరో కమల్ హసన్ విజయ్ కు మద్దతు ప్రకటిస్తారా అన్నిది కూడా అనుమానమే. ఇప్పటికే డీఎంకే మద్దతుతో రాజ్యసభలోకి అడుగుపెట్టిన ఈ లోక్ నాయకుడు.. బహిరంగంగా విజయ్ కు మద్దతు ప్రకటించే అవకాశాలు లేవని అంటున్నారు. వీరిద్దరినీ పక్కన పెడితే కోలీవుడ్ పరిశ్రమలో విజయ్ వెంట నిలిచేదెవరన్న ప్రశ్న తలెత్తుతోంది. విజయ్ అభిమానులు మాత్రం తమిళ అగ్ర నటులంతా ముందుకు వచ్చి విజయ్ కు మద్దతు పలకాలని ఆశిస్తున్నారు. అయితే ప్రముఖ నటి త్రిష మాత్రం రాజకీయంగా తలపతి విజయ్ కు బహిరంగ మద్దతు ప్రకటించారని అంటున్నారు. ఇటీవల దుబాయ్ లో  ఫెమా ఫంక్షన్ లో ఆమె రాజకీయంగా విజయ్ అనుకున్నది సాధించాలని ఆకాంక్షిస్తూ బెస్టాఫ్ లక్ చెప్పారు.

 దాదాపు రెండు దశాబ్దాలుగా తమిళ తెలుగు సినిమాలలో హీరోయిన్ గా ప్రముఖ స్థానంలో ఉన్న త్రిష సినీ కెరీర్ ఇప్పుడు కొద్దిగా నెమ్మదించింది. దీంతో సహజంగానే ఆమె తదుపరి అడుగు రాజకీయాలవైపు పడుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తలపతి విజయ్ కు ఏదో మామూలుగా బెస్టాఫ్ లక్ చెప్పలేదనీ, ముందు ముందు ఆమె తలపతి విజయ్ పార్టీ ద్వారానే రాజకీయ ప్రవేశం చేసే అవకాశం ఉందనీ  అంటున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu